సీతమ్మ నడిచింది రాముని వెంటా
చిత్రం : గుణవంతుడు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
సీతమ్మ నడిచింది రాముని వెంటా..
సీతమ్మ నడిచింది రాముని వెంటా
రాముడు ఉన్నాడు సీతమ్మ కంటా..
సీతమ్మ నడిచింది రాముని వెంటా
అడవంతా పులకరించి పూచెనంట..
అడవంతా పులకరించి పూచెనంట
ఆకుటిల్లె వారి ప్రణయ లోకమంట..
సీతమ్మ నడిచింది రాముని వెంటా
చరణం 1 :
కొమ్మమీద గోరువంక కులుకులాడి
చిలక వంక కొంటెగా చూచెనంటా
కొమ్మమీద గోరువంక కులుకులాడి
చిలక వంక కొంటెగా చూచెనంటా
పంచవటి పంచలోని పంచవర్ణ రామచిలుక
పైట సర్దుకున్నదంటా
పంచవటి పంచలోని పంచవర్ణ రామచిలుక
పైట సర్దుకున్నదంటా
పచ్చగడ్డి మేసేటి పసిడిలేడి మేతమాని . .
పరుగులే తీసెనంటా
సీతమ్మ చెవిలోన రాముడేదో చెప్పగా . .
సిగ్గుపడి పోయెనంటా
సీతమ్మ నడిచింది రాముని వెంటా
చరణం 2 :
పొదరిల్లే సవరించి.. చిగురుటాకు తలుపు మూసి..
తీగలే ఊయలగా ఊగిరంటా
పొదరిల్లే సవరించి.. చిగురుటాకు తలుపు మూసి..
తీగలే ఊయలగా ఊగిరంటా
ఎటుచూసినా జంటలై ఒకే వలపు పంటలై
ఋతువులన్ని ఏకమై వచ్చెనంటా
ఎటుచూసినా జంటలై ఒకే వలపు పంటలై
ఋతువులన్ని ఏకమై వచ్చెనంటా
వెచ్చదనం చల్లదనం పెంచెనంటా . .
వెచ్చదనం చల్లదనం పెంచెనంటా..
వెన్నెలతో నీరెండ వియ్యమంటా
సీతమ్మ నడిచింది రాముని వెంటా...
రాముడు ఉన్నాడు సీతమ్మ కంటా
అడవంతా పులకరించి పూచెనంట...
ఆకుటిల్లె వారి ప్రణయ లోకమంట..
సీతమ్మ నడిచింది రాముని వెంటా..
సీతమ్మ నడిచింది రాముని వెంటా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి