తొలి సంధ్య వేళలో (P Susheela)
చిత్రం : సీతారాములు (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో
వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం....
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో
వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం....
చరణం 1 :
జీవితమే రంగుల వలయం..
దానికి ఆరంభం సూర్యుని ఉదయం..
ఆ.. ఆ... ఆ..
జీవితమే రంగుల వలయం..
దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం.. దొరికే ఒక హృదయం..
ఆ హృదయం సంధ్యారాగం..
మేలుకొలిపే అనురాగం..
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో
వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం....
చరణం 2 :
సాగరమే పొంగుల నిలయం..
దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతికెరటం..చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం.. అది అంటదు ఆకాశం..
ఆ ఆకాశంలో ఒక మేఘం..
మేలుకొలిపే అనురాగం
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో
వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం....
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి