నమ్మ జాలరే యశోదా తనయుని
రచన : రామకృష్ణ దువ్వు,
కంపోజింగ్ : Dr Y బాల గణేష్,
గానం : మూల శ్రీలత,
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం.
ప్రొడ్యూసర్స్ : RKSS Creations
పల్లవి:
నమ్మ జాలరే యశోదా తనయుని
మహిమలెన్నని అచ్చెరవొందగ
నిక్కమదియె జగతి నందు
ఇతని సాటి లేనే లేరు
చరణం 1:
పాలు త్రాగే ప్రాయము లో రక్కసి పూతను చంపే
బుడి బుడి అడుగులు వేస్తూ బండి చక్రమందు
ఆ అసురుని నరకముకే సాగనంపే
వ్రేపల్లె నందు వెలుగు నింపే
చరణం2:
మన్ను తిన్న నోటి తోనె తల్లికి జగములు జూపె
వెన్న దొంగను అదుపు చేయగా రోటికీ
కట్టగా
శాపవిమోచనము చేసే చెట్లను
కూల్చీ
విస్మయ పరచే గోకులమంతా ..
చరణం 3:
సుడిగాలై కమ్ముకు వచ్చిన తృణావర్తుని
ప్రాణములను అవలీలగ
హరించినాడే
యమునా నదిలో విషమును చిమ్మే
కాళీయుని పడగలు మర్ధించి నటించి నాడే
బృందావనమున కనువిందు వాడే
చరణం 5:
దిక్కుల పాలించే వాడి దర్పమణచగ
వేలి కొనతో గోవర్ధన గిరినెత్తినాడే
జీవులందరిని తానై కాచినాడే
బాలుడీతడు నందుని ఇంట
వెలసియున్న హరి.. గోవిందుడు..
- రామకృష్ణ దువ్వు
RKSS Creations...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి