28, జనవరి 2022, శుక్రవారం

పాలకంకి మీదుంది పైరు | Palakanki Meedundi | Song Lyrics | Katakatala Rudrayya (1978)

 పాలకంకి మీదుంది పైరు 


చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)

రచన : వేటూరి

సంగీతం : జె వి రాఘవులు 

పాడినవారు : బాలు, సుశీల 


పల్లవి :


పాలకంకి మీదుంది పైరు 

అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 

ఒడిసి పట్టి కొట్టబోతే  గడుసు పిట్టరో

కన్నుకొట్టి తుర్రు మంది కన్నె మోజు పిట్టరో 

కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పాలకంకి మీదుందా  పైరు

అరెరే పడలేవా ఈ పిట్టల పోరు 

ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 

కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 

పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో 

ఎహె ...

చరణం 1 :

మొదని  కన్ను గింజనుకొని  కులికింది పికిలి పిట్టా 

పెదవి దొండ పండనుకొని చిదిమింది చికిలి పిట్టా 

పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 

పొదుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా

ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 


చరణం 2 :

నీలాంటి రేవు కాడ తెల్లారి పొద్దు కాడ 

ఏమైందటా...

ఒడ్డుమీద ముక్కు పుడక పట్టుకెళ్ళే పాడు పిట్ట 

వెరీ వెరీ గుడ్డు ...

ఆరేసుకున్న కొక కాజేయ లేక నిన్న

ఎక్కించుకున్న రైక ఎత్తుకెళ్లే పడుచు పిట్ట  

బావుంది బావుంది 

ఈ పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 

ఆ పొడుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా

ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 


పాలకంకి మీదుంది పైరు 

అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 

ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 

కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 

కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో


 - పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి