27, జనవరి 2022, గురువారం

ఆడది కోరుకునే వరాలు | Aadadi Korukune Varalu | Song Lyrics | Radhamma Pelli (1974)

 ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

చిత్రం  :  రాధమ్మ పెళ్ళి (1974)
సంగీతం  :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  : జానకి


పల్లవి :

ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం.. చక్కని సంతానం

చరణం 1 :

కాపురమే ఒక మందిరమై.. పతియే తన దైవమై
కాపురమే ఒక మందిరమై.. పతియే తన దైవమై
అతని సేవలో తన బ్రతుకే హారతి యైపోతే
అంతకుమించిన సౌభాగ్యం ఆడదానికేముంది..  

ఆడదానికింకేముంది
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం

చరణం 2 :

ఇల్లాలే ఒక తల్లియై..  చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో.. తాను కరిగిపోతే
ఇల్లాలే ఒక తల్లియై.. చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో.. తాను కరిగిపోతే
అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంది.. 

ఆ తల్లికింకేముంది   
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం.. చక్కని సంతానం


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి