23, జనవరి 2022, ఆదివారం

బుల్లి పిట్టా బుజ్జి పిట్టా | Bulli Pittta Bujji Pitta | Sad | Song Lyrics| Chinna Rayudu (1992)

బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా


చిత్రం: చినరాయుడు (1992) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: భువనచంద్ర 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా ..
గూటిలోని  గువ్వా  పిట్టా 
పంజరానా  రామచిలుక  ఎట్టా  ఉన్నాది ..
అది  ఎవరి  ఎవరి  తెలిపేది ..
ఎన్ని  నాళ్లే  ఇట్టా  గడిచేది ..
బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా ..
చెట్టు  మీద  పాల  పిట్టా ..
ఊరిలోని  గోరువంక  ఎట్టా  ఉన్నది ..
అది  ఎవరి  ఎవరి  తెలిపేది ..
నేనెట్టా  ఎట్టా  బతికేది  . .
బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా ..
గూటిలోని  గువ్వా  పిట్టా ..
పంజరానా  రామచిలుక  ఎట్టా  ఉన్నాది ..
బుల్లి  పిట్టా  బుజ్జి  పిట్టా ..
చెట్టు  మీద  పాల  పిట్టా ..
ఊరిలోని  గోరువంక  ఎట్టా  ఉన్నది ..


చరణం 1

నిన్నే  తలుచుకుంటూ ..
ప్రాణం  నిలుపుకుంటూ ..
నీకై  నిలిచి  ఉంది   శ్వాస ..
కాలం  కరుగుతున్న ..
శోకం  పెరుగుతున్నా ..
ఏదో  జరుగునున్న  ఆశ ..
పూమాల  వాడలేదు ..
పారాణి  ఆరలేదు ..
అయినా  లోకం  జాలి  చూపేదే ..
నీ  గుండె  చప్పుడింకా ..
నా  గుండె  చేరలేదు ..
అయినా  అయినా  కదా  మారదు..
కష్టాలన్నీ  గాయాలే ..
అవి  కాలంతోటే  మానాలే ..

చరణం 2

నువ్వే  దేవుడివన్న ..
ఊరే  నిందిస్తూ  ఉంటె ..
చెప్పలేని  గుండె  కొత్త ..
కళ్ళే  కలుపుకుని 
ఎన్నో  కలలుగన్న ..
వేలే  కాటేసింది  బాధ ..
మురిపాన  కట్టుకున్న ..
పొదరిల్లు  కూలిపోతే ..
ఎదలో  రగిలే  మంటలాడునా ..
నూరేళ్ళ  పంట  ఇట్టా ..
మూన్నాళ్ళ  ముచ్చటైతే ..
మామా  మామా  వ్యధ  తీరునా ..
మళ్ళీ  ఎట్టా  కలిసేది ..
నా  ప్రాణం  ఎట్టా  నిలిపేది ..


- పాటల ధనుస్సు
-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి