21, జనవరి 2022, శుక్రవారం

చిరు చిరు నవ్వుల శ్రీవారు | Chiru Chiru Navvula srivaru | Song Lyrics | Adrusta Jathakudu (1971)

 చిరు చిరు నవ్వుల శ్రీవారు

చిత్రం  :  అదృష్ట జాతకుడు (1971)
సంగీతం  :  టి. చలపతిరావు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  సుశీల

పల్లవి :

చిరు చిరు నవ్వుల శ్రీవారు.. చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా.. కిమ్మనరు.. రమ్మనరు
కిమ్మనరు... రమ్మనరు  

చరణం 1 :

చల్లగాలి పిలిచింది..  జాజి తీగె పలికింది
చల్లగాలి పిలిచింది..  జాజి తీగె పలికింది
కన్నెతార సైగలలో.. చందమామ సాగింది.. చందమామ సాగింది
   చిరు చిరు నవ్వుల శ్రీవారు.. చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు.. రమ్మనరు
కిమ్మనరు.. రమ్మనరు

చరణం 2 :

పూల బాల రమ్మంది.. రాగాల తుమ్మెద ఝుమ్మంది
పూల బాల రమ్మంది.. రాగాల తుమ్మెద ఝుమ్మంది
వెండి పూల వెన్నెలలో నిండు హాయి విరిసింది.. నిండు హాయి విరిసింది
 చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు.. రమ్మనరు  
కిమ్మనరు.. రమ్మనరు 

చరణం 3 :

లేత కోరిక పెరిగింది.. రేయి సగమే మిగిలింది
లేత కోరిక పెరిగింది.. రేయి సగమే మిగిలింది
సరసా లెరిగిన మావారే... ఉలకక పలకక ఉన్నారే.. ఉలకక పలకక ఉన్నారే
  చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా..  కిమ్మనరు.. రమ్మనరు..  కిమ్మనరు..రమ్మనరు

 - పాటల ధనుస్సు

2 కామెంట్‌లు: