28, ఫిబ్రవరి 2026, శనివారం

మనసులు మురిసే సమయమిది | Manasulu Murise Samayamidi | Song Lyrics | Premalu Pellillu (1974)

మనసులు మురిసే సమయమిది


చిత్రం :  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల


పల్లవి :


మనసులు మురిసే సమయమిది.. 

తనువులు మరిచే తరుణమిది

మనసులు మురిసే సమయమిది.. 

తనువులు మరిచే తరుణమిది

నీ కౌగిలిలో యవ్వనమంతా 

పువ్వై విరిసే వేళ యిది

నీ కౌగిలిలో యవ్వనమంతా 

పువ్వై విరిసే వేళ యిది

ఆ.. వేళ యిది....  ఆ.. వేళ యిది


చరణం 1 :


లలలల ....లల లాలల... 

లలలల ....లల లాలల

లలలల ....లల లాలల.. 

లలలల ....లల లాలల


 తెలిమబ్బు జంట గగనాల వెంట 

జత జేరుతున్నది

హృదయాలు రెండు యీ తీరమందు 

పెనవేసుకున్నవి


సెలయేటి జంట ఆ కోనలందు 

కలబోసుకున్నది... 

పరువాలు రెండు ఒక దారివెంట 

పయనించుచున్నవి


నీలాల నీ కళ్ళలో...  

నీ రూపమే వున్నది  

నీలాల నీ కళ్ళలో...  

నీ రూపమే వున్నది

ఆశలే .. పెంచుకో ... 

మోజులే ... పంచుకో


మనసులు మురిసే సమయమిది.. 

తనువులు మరిచే తరుణమిది

నీ కౌగిలిలో యవ్వనమంతా 

పువ్వై విరిసే వేళ యిది... 

పువ్వై విరిసే వేళ యిది


చరణం 2 :


ఈ అంద చందాలలో 

ఈ ప్రేమ బంధాలలో.. 

ఉయ్యాల లూగిందిలే నేడు 

నా జీవితం

ఈ అంద చందాలలో 

ఈ ప్రేమ బంధాలలో... 

ఉయ్యాల లూగిందిలే నేడు 

నా జీవితం


నా సొగసులన్నిఈ నాటినుండి 

నీ సొంతమాయెలే

మన జంట చూసి ఈ లోకమంత 

పులకించి పోవులే


నిండైన మన ప్రేమలు 

నిలిచేను కలకాలము

తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో


మనసులు మురిసే సమయమిది.. 

తనువులు మరిచే తరుణమిది

నీ కౌగిలిలో యవ్వనమంతా 

పువ్వై విరిసే వేళ యిది

ఆ... వేళ యిది ఆ... వేళ యిది...  

పువ్వై విరిసే వేళ యిది 


- పాటల ధనుస్సు 


మనసులేని దేవుడు | Manasuleni Devudu | Song Lyrics | Premalu Pellillu (1974)

మనసులేని దేవుడు


చిత్రం : ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : రామకృష్ణ, 


పల్లవి :


మనసులేని దేవుడు.. 

మనిషి కెందుకో మనసిచ్చాడు

మనసులేని దేవుడు.. 

మనిషి కెందుకో మనసిచ్చాడు

మనసు మనసును వంచన చేస్తే... 

కనులకెందుకో నీరిచ్చాడు..

కనులకెందుకో నీరిచ్చాడు

మనసులేని దేవుడు... 

మనిషి కెందుకో మనసిచ్చాడు


చరణం 1 :


మనిషికీ.. దైవానికీ 

ఏనాటి నుంచో వైరము

మనిషికీ.. దైవానికీ 

ఏనాటి నుంచో వైరము

వీడి కోరిక వాడు తీర్చడు... 

వాడి దారికి వీడు వెళ్లడు....

వాడి దారికి వీడు వెళ్లడు

మనసులేని దేవుడు... 

మనిషి కెందుకో మనసిచ్చాడు


చరణం 2 :


ప్రేమనేది ఉన్నదా.. 

అది మానవులకే ఉన్నదా ?

ప్రేమనేది ఉన్నదా ?..  

అది మానవులకే ఉన్నదా ?

హృదయముంటే తప్పదా.. 

అది బ్రతుకు కన్నా గొప్పదా..

అది బ్రతుకు కన్నా గొప్పదా......

మనసులేని దేవుడు ... 

మనిషి కెందుకో మనసిచ్చాడు


చరణం 3 :


ఏమిటో ఈ ప్రేమ తత్వం ?...  

ఎక్కడుందో మానవత్వం

ఏమిటో ఈ ప్రేమ తత్వం?... 

ఎక్కడుందో మానవత్వం

ఏది సత్యం.. ఏది నిత్యం..  

ఏది సత్యం.. ఏది నిత్యం

చివరికంతా శూన్యం.. శూన్యం..

చివరికంతా శూన్యం.. శూన్యం....


మనసులేని దేవుడు.. 

మనిషి కెందుకో మనసిచ్చాడు

మనసు మనసును వంచన చేస్తే... 

కనులకెందుకో నీరిచ్చాడు

కనులకెందుకో నీరిచ్చాడు ... 

కనులకెందుకో నీరిచ్చాడు


- పాటల ధనుస్సు 


జిగినక జిగిజిగినక అంబ పలుకు | Jiginaka Jigijiginaka | Song Lyrics | Iddaru Dongalu (1984)

జిగినక జిగిజిగినక అంబ పలుకు


చిత్రం : ఇద్దరు దొంగలు (1984)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


జిగినక.. జిగిజిగినక...

అంబ పలుకు జగదంబ పలుకు... 

సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...

దులుపు దులుపు 

నీ తళుకు బెళుకు 

నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...

అంబ పలుకు జగదంబ పలుకు... 

సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...

దులుపు దులుపు 

నీ తళుకు బెళుకు 

నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...

అరే... జిగినక.. జిగిజిగినక... 


చరణం 1 :


రాక రాక వచ్చినావు 

రాతిరంతా నీదోనురోయ్... 

హహ

వచ్చినాక వెళ్ళలేవు 

రాపిడంతా నాదేనురోయ్... హా


అహాహా... 

నంగనాచి రంగసాని 

దొంగసొత్తు దోచెయ్యనా..హా

ఉంగరాల జుట్టు తీసి 

చెంగుముద్దు కాజేయ్యనా... హా 


ఈ దోపిడి వద్దుర మావా... 

మరి రాతిరికెట్టా భామా

తీగదాక సాగినాక 

పోకచెక్కలివ్వమంటే 

పొద్దుపోదు తెలుసా


జిగినక.. జిగిజిగినక...

అంబ పలుకు జగదంబ పలుకు... 

సొగసమ్మ తళుకు తందానరోయ్

అరే... జిగినక.. జిగిజిగినక...

దులుపు దులుపు 

నీ తళుకు బెళుకు 

నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...

జిగినక.. జిగిజిగినక...


చరణం 2 :


చీకటింటికొచ్చినాక 

చీకుచింత తీర్చెయ్యనా...హా

సిగ్గు వచ్చిపోయినాక 

చీర నీకు కట్టెయ్యనా... హా


హహహ... 

సొమ్ములన్ని దోచుకుంటే 

సొమ్మసిల్లిపోతానురో..అయ్యయ్యో

సోకులన్నీ రాలిపోతే 

అమ్మతల్లి అంటానురో... 


అనుకోవే కృష్ణారామా... 

మరి బ్రతికేదెట్టా మావా

కాలమంతా చెల్లిపోతే 

కాయ కాస్త పండిపోతే... 

దిక్కులేదు తెలుసా


జిగినక.. జిగిజిగినక...

అంబ పలుకు జగదంబ పలుకు... 

సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...

దులుపు దులుపు 

నీ తళుకు బెళుకు 

నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...

అరే... జిగినక.. జిగిజిగినక... 


- పాటల ధనుస్సు


ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది | Evariki Cheppedi | Song Lyrics | Eenati Bandham Enatido (1977)

ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది


చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఎం. బాలయ్య

నేపధ్య గానం: సుశీల


పల్లవి:


ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

నేనెవరికి చెప్పేది 

మనసిప్పేమని చెప్పేది

హోరున వీచే గాలికా.. 

చిరుగాలికా..

ఉరకలు వేసే నీటికా.. 

సెలయేటికా..

ఎవరికి చెప్పేది? 

ఏమని చెప్పేది?


చరణం 1:


నీటిలోని కలువను నేను.. 

నింగినేలే జాబిలి తాను

నీటిలోని కలువను నేను.. 

నింగినేలే జాబిలి తాను

నన్నే తలచి మదిలో వలచి

నన్నే తలచి మదిలో వలచి

దివి నుండి తానె దిగి రాగా 

ఆ ఆ ఆ...

కలవరపరచే కమ్మని తలపులు.. 

ఇవి.. ఇవి..

అని ఎవరికి చెప్పేది? 

ఏమని చెప్పేది?


చరణం 2:


మల్లె తీగలు పందిరి కోసం 

ఎదిగెదిగి ఎగబాకిన చందం

మల్లె తీగలు పందిరి కోసం 

ఎదిగెదిగి ఎగబాకిన చందం

పొందు కోరి పొంచిన పరువం

పొందు కోరి పొంచిన పరువం

నచ్చిన వానిని పెనేసుకోదా.. 

ఆ ఆ ఆ..

ఉప్పెనలా వచ్చే ఊహలు 

ఇవి.. ఇవి..


అని ఎవరికి చెప్పేది? 

ఏమని చెప్పేది?

నేనెవరికి చెప్పేది 

మనసిప్పేమని చెప్పేది

హోరున వీచే గాలికా 

చిరుగాలికా

ఉరకలు వేసే నీటికా 

సెలయేటికా..

లాల లలల లలాలల

లాల లలల లలాలల


- పాటల ధనుస్సు 


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు | Evaru Nerperamma Eekommaku | Song Lyrics | Eenati Bandham Enatido (1977)

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు


చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దేవులపల్లి

నేపథ్య గానం: సుశీల


పల్లవి:


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు .....

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. 

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...

ఎంత తొందరలే హరి పూజకు ...

ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... 

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..


చరణం 1:


కొలువైతివా దేవి నాకోసము...

కొలువైతివా దేవి నాకోసము..

తులసీ ..... 

తులసీ దయాపూర్ణకలశీ...

కొలువైతివా దేవి నాకోసము..

తులసీ....తులసీ దయాపూర్ణకలశీ...

మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....

మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... 

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు

ఎంత తొందరలే హరి పూజకు... 

ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...


చరణం 2:


ఏ లీల సేవింతు.. 

ఏమనుచు కీర్తింతు...

ఏ లీల సేవింతు.. 

ఏమనుచు కీర్తింతు

సీత మనసే నీకు సింహాసనం...

ఒక పువ్వు పాదాల....

ఒక దివ్వె నీ మ్రోల....

ఒక పువ్వు పాదాల...

ఒక దివ్వె నీ మ్రోల

ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....

ఇదే వందనం .....


- పాటల ధనుస్సు 


27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

నేననుకున్నది కాదూ | Nenanukunnadi Kadu | Song Lyrics | Eenati Bandham Enatido (1977)

నేననుకున్నది కాదూ


చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: ఎం. బాలయ్య 

నేపధ్య గానం: బాలు, సుశీల 


సాకి : 


శిలనొక్క ప్రతిమగా...

మలచింది నీవే... 

ఆ ప్రతిమనీ.. దైవముగా...

కొలిచింది నీవే... 


పల్లవి: 


నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 

కలనైనా తలచింది కానే కాదు...

ఏనాటిదో ఈ బంధం... 

ఈ వెన్నెల్లా.. జాబిల్లి అనుబంధం.... 


మదినొక్క గుడివోలే...

మలచింది నీవే... 

ఆ గుడిలోనే కరుణతో...

వెలసింది నీవే.... 


నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 

కలనైనా తలచింది కానే కాదు...

ఏనాటిదో ఈ బంధం... 

ఈ వెన్నెల్లా... 

జాబిల్లి అనుబంధం.... 

నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 


చరణం 1: 


నీ చెంతగ ఎన్నాళ్ళున్నా...

నిన్ను చేరుకోలేదు... 

ఎదుట ఉన్న పారిజాతం ..

ఎదను చేర్చుకోలేదు... 


అపరంజి కోవెల ఉన్నా..

అలరారు దైవం ఉన్నా... 

ఆ గుడితలుపులు 

ఈనాడే తెరచుకున్నాయి...

లోనికి పిలుచుకున్నాయి.... 


నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 


చరణం 2: 


కడలి నిండ నీరున్నా..

కదలలేని నావను నేను.. 

అడగాలని మదిలో ఉన్నా.. 

పెదవి కదపలేకున్నాను.. 

నావకు తెరచాపనై...

నడిపే చిరుగాలినై... 

కలలో.. ఇలలో ..

నీ కోసం పలవరించేనూ...

నీలో కలిసిపోయేనూ... 


నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 

కలనైనా తలచింది కానే కాదు...

ఏనాటిదో ఈ బంధం... 

ఈ వెన్నెల్లా జాబిల్లి 

అనుబంధం....ఉమ్మ్...ఉమ్మ్.. 

నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ...


- పాటల ధనుస్సు 


ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా | Idli Papa Idli Papa | Song Lyrics | Donga Mogudu (1987)

 ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా


చిత్రం: దొంగ మొగుడు (1987)

రచన : వేటూరి   

సంగీతం: చక్రవర్తి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి:


ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా 

సాంబారు కావాలా

చిట్టిగారెతో చట్నీ కలిపీ 

నోట్లో పెట్టాలా

చూపులతోనే కాఫీ కాసి 

నేనే నీకూ ఇవ్వాలా

వద్దని నువ్వూ పంతం పడితే 

నిన్నే బజ్జో పెట్టాలా


హొయ్ 

ముద్దుల రాజా ముద్దుల రాజా 

ముచ్చట కావాలీ

హొయ్ 

పంచదారతో పాలవయసును 

పాకం పట్టాలీ

మీగడలాంటి ఆగడమంతా 

నీలో చూడాలి

హొయ్ 

అందం చందం హంగూ పొంగూ 

నీకే సొంతం కావాలీ


చరణం 1:


అబ్బా ఏమిటండి మీరు మరీను

ఏమ్మా అక్కర్లేదా?

కాదు.. హా మరేంటి?.. ఊఁ


అరె వేసుకో.. పెనవేసుకో.. 

బుస కొట్టే నాగల్లే

చేసుకో.. సడి చేసుకో.. 

చెలరేగే వాగల్లే

కట్టుకో.. ఆకట్టుకో.. 

ఎద చాటున మాటేసీ..

చూసుకో.. గురి చూసుకో.. 

నీ చూపుల వలవేసీ..

పాలబుగ్గలో కొత్తపొంగులూ 

నన్నే ఊరించే

కొంటె సైగలో కొండగాలులూ 

నన్నే ఊగించే

నీ ముద్దును నేనైతే.. 

నా ముద్దర నీవైతే

ఆహ నీ ముద్దును నేనైతే.. 

నా ముద్దర నీవైతే

నిండింది నా మనసు 

నీ మాటతో

పండింది నా పంట 

ఈనాటితో


హొయ్ 

ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా 

సాంబారు కావాలా

చిట్టిగారెతో చట్నీ కలిపీ 

నోట్లో పెట్టాలా

హొయ్ 

ముద్దుల రాజా ముద్దుల రాజా 

ముచ్చట కావాలీ

హొయ్ 

పంచదారతో పాలవయసును 

పాకం పట్టాలీ


చరణం 2:


హొయ్ 

రెచ్చిపో..ముడుపిచ్చిపో.. 

నువ్వు దాచిన ఈడంతా

పంచిపో..కరిగించిపో..

కైపెక్కిన మనసంతా

చేరుకో.. ఇక చేదుకో.. 

నా సిగ్గుల పేరంటం

పుచ్చుకో.. సరిపుచ్చుకో.. 

నా చూపుల తాంబూలం

అరె తట్టితాకితే తాళమియ్యని 

ఎర్రని చెక్కిళ్ళు

చిటికె వేసితే చిందులాడనీ 

నీలో సందళ్ళు

అహ ఊరెను ఉవ్విళ్ళు.. 

ఎద కోరెను కౌగిళ్ళూ

అహ ఊరెను ఉవ్విళ్ళు.. 

ఎద కోరెను కౌగిళ్ళూ

నా చూపే నిలవాలి 

నీ ముందరా

తెల్లార్లూ సాగాలీ 

ఈ జాతరా


అహ 

ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా 

సాంబారు కావాలా ఆఁ

చిట్టిగారెతో చట్నీ కలిపీ 

నోట్లో పెట్టాలా ఆఁ

చూపులతోనే కాఫీ కాసి 

నేనే నీకూ ఇవ్వాలా

వద్దని నువ్వూ పంతం పడితే 

నిన్నే బజ్జో పెట్టాలా


హొయ్ 

ముద్దుల రాజా ముద్దుల రాజా 

ముచ్చట కావాలీ ఆహా

హొయ్ 

పంచదారతో పాలవయసును 

పాకం పట్టాలీ ఆహా

మీగడలాంటి ఆగడమంతా 

నీలో చూడాలి

అరెరెరె 

అందం చందం హంగూ పొంగూ 

నీకే సొంతం కావాలీ


- పాటల ధనుస్సు 


ఈ చెంపకు శలవీయకు | Eechempaku Selaveeyaku | Song Lyrics | Donga Mogudu (1987)

ఈ చెంపకు శలవీయకు


చిత్రం: దొంగ మొగుడు (1987) 

రచన : వేటూరి 

సంగీతం: చక్రవర్తి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


ఈ చెంపకు శలవీయకు 

ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... 

హోయ్ 


ఈ చెంపకు శలవీయకు 

ఈ పెదవిని వదిలేయకు 


చరణం 1: 


నీ వేళ్ళు చేసే అల్లరి కుచ్చెళ్ళు 

పాడే పల్లవి 

తుఫాను రేగే ముందర ముస్తాబు 

దేనికి దండగ 

కంటి చూపు చీర కట్టాలి ఒంటిని 

కంచి పట్టు చీర జారాలి నేలనీ 

ఈ వేడీలో వాడనీ ...

ఈ గాలినీ పూలనీ... 

గండి పడ్దది నింగి చెరువుకి 

వెండి వెన్నెల పొంగుతున్నదీ 

గోరింత తుళ్ళింత వెల్లువయ్యేలా.... 

హోయ్ 


ఈ చెంపకు శలవీయకు 

ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... 

హోయ్ 


చరణం 2: 


పై పైకి రాకు సూర్యుడా పొద్దంటే 

మాకు చేదురా 

తెల్లారుతున్నా తీరక అల్లాడుతోందీ 

కోరికా 

కక్ష గట్టి వచ్చి మా తలుపు తట్టకు 

వెలుగు వలలు తెచ్చి 

మా తలలు పట్టకు 

ఈ రేయిని ఆగనీ... 

ఈ హాయినీ సాగనీ... 

పాలపుంతలో పూల వేడుక 

కౌగిలింతలో ఇలకు జారక 

తాపాల దాహాలు తీరిపోయేలా...


ఈ చెంపకు శలవీయకు 

ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... 

హోయ్ 


- పాటల ధనుస్సు 


24, ఫిబ్రవరి 2026, మంగళవారం

నల్ల౦చు తెల్లచీర | Nallanchu Tella Cheera | Song Lyrics | Donga Mogudu (1987)

నల్ల౦చు తెల్లచీర


చిత్రం: దొంగ మొగుడు (1987)

సంగీతం: చక్రవర్తి

 గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


నల్ల౦చు తెల్లచీర

 ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా

 ఓ..ఓ..ఈడెక్కి కవ్వి౦చితే భామా.. 

వేడెక్కి నేరేగనా..

ముసిరే మిసమిసలే 

గుసగుసగా వలవిసిరే హొయ్


బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... 

చూడొద్దు తేరిపారా 

ఒహొకోరేవు మోమాటము రాజా... 

రేపేవు ఆరాటమూ

విరి తూపుల జడిలో పడి 

వసివాడేను సొగసే... హొయ్


చరణం 1:


సాగే వన్నెవాగే నన్ను... 

కమ్మేసి౦దిరో

ఊగే కన్నెలాగే నన్ను ...

లాగేసి౦దిరో

మూగే మూగ సైగే నన్ను ...

ముద్దాడి౦ద రో

ఊగే తీగలాగే మేను... 

అల్లాడి౦దిరో


గాజుల బాజాలతో ...

జాజులు ఊరేగెనే

మోజుల రోజాలతో ...

రోజులు ఎదురేగెనే

తనివే తీరని... 

తనిమే ఊరనీ

జతలో గతులే... జతులై...


బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... 

చూడొద్దు తేరిపారా

 ఒహొనల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. 

తల్లోన మల్లెమాలా ఓ..


చరణం 2:


కాగే ఈడు కోరే 

వేడి ఉ౦దీ లోయలో

రేగే చల్లగాలే 

ము౦చుతు౦ది మాయలో

రాలే మ౦చుపూలే 

పె౦చె నాలో దాహము

జాలేలేని చలిలో 

ది౦చుతు౦ది మోహము


కౌగిలి చెరసాలలో ...

ఈ చెలి చిక్కాలిలే

పెదవుల సరసాలలో... 

కోరిక కరగాలిలే

మరిగే మరులనే... 

నదులై పారనీవిరులే 

జడిసే ఒడిలో....ఏహ్..


నల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. 

తల్లోన మల్లెమాలా

 ఓ..ఓ..ఈడెక్కి కవ్వి౦చితే 

భామా.. వేడెక్కి నేరేగనా

ముసిరే మిసమిసలే 

గుసగుసగా వలవిసిరే హొయ్..


బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... 

చూడొద్దు తేరిపారా ఒహొ

కోరేవు మోమాటము రాజా... 

రేపేవు ఆరాటమూ

విరి తూపుల జడిలో పడి 

వసివాడేను సొగసే... హొయ్


- పాటల ధనుస్సు 


కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు | Kokamma Cheppamma | Song Lyrics | Donga Mogudu (1987)

కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో 


చిత్రం : దొంగ మొగుడు (1987)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :


ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ..

కోకమ్మ చెప్పమ్మ 

చెలి సోకు ఏపాటిదో

వద్దమ్మ తప్పమ్మ 

తెలిసాక విలువేమిటో


నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే

ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే

ఊరించుతూ నన్ను 

వేధించడం న్యాయమా.. ఆ.. ఆ.. ఆ.. 


కోకమ్మ చెప్పమ్మ 

చెలి సోకు ఏపాటిదో

వద్దమ్మ తప్పమ్మ 

తెలిసాక విలువేమిటో


చరణం 1 :


కన్నెకుసుమం కన్ను గీటి 

నన్ను పిలిచిన వేళ

తేనె వానల తాన మాడగ 

తేటినై నే రానా... లలలలలా

కాటు వేసిన మోటు సరసం 

హాయి గురుతై పోగా

ఘుమ్ముఘుమ్ముగ కమ్ముకున్న 

మత్తు వరదై రాదా 


ఓ.. ఓహో.. ఓ.. ఓ.. మారం చేసే 

ఆరలన్నీ తీరాలి ఈ వేళలో..

ఓ.. ఓహో.. ఓ.. ఓ.. పందెం వేసే 

అందాలన్నీ ఊగాలి ఉయ్యాలలో...

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


కోకమ్మ చెప్పమ్మ 

చెలి సోకు ఏపాటిదో

వద్దమ్మ తప్పమ్మ 

తెలిసాక విలువేమిటో


చరణం 2 : 


వలపు వానా కురిసినాక 

వలపు వరదై పోదా

కోరికలతో ఏరువాక 

సాగు తరుణం రాదా.. 

లలలలలా


కన్న కలలు కోతకొస్తే 

పుష్యమాసం రాదా

శోభనాల సంకురాతిరి 

సంబరాలే కాదా...


అహ..హ..హా..అహా..హ..హా

తూనిగల్లే ఆనందాలే 

తేలాలి ఈ గాలిలో

ఓ..ఓ..ఓ..ఓ.. తేనేగల్లే 

మకరందాలే తూలాలి 

ఈ పూలలో...


కోకమ్మ చెప్పమ్మ 

చెలి సోకు ఏపాటిదో

వద్దమ్మ తప్పమ్మ 

తెలిసాక విలువేమిటో

నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే

ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే

ఊరించుతూ నన్ను 

వేధించడం న్యాయమా.. 

ఆ.. ఆ.. ఆ.. 


- పాటల ధనుస్సు


23, ఫిబ్రవరి 2026, సోమవారం

నీ కోకకింత కులుకెందుకు | Nee Kokakintha Kuluku | Song Lyrics | Donga Mogudu (1987)

నీ కోకకింత కులుకెందుకు 


చిత్రం :  దొంగ మొగుడు (1987)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి


పల్లవి :


ఓయ్.. 

నీ కోకకింత కులుకెందుకు.. 

రప్పపపరప్పప... రప్పపపప

నీ రైకకింత బిగువెందుకు.. 

రప్పపపరప్పప... రప్పపపప

అందాలన్నీ చుట్టుకున్నందుకా

సింగారాన్ని దాచుకున్నందుకా

చిన్నారి నీ మేను 

ముద్దాడుతున్నందుకా.. హా..


నీ చూపుకింత చురుకెందుకు.. 

రప్పపపరప్పప... రప్పపపరప్పప

నీ చేతికింత చొరవెందుకు.. 

రప్పపపరప్పప... రప్పపపరప్పప

అందాలన్నీ కొల్లగొట్టేందుకా..

ఆరాటాలు చెల్లబెట్టేందుకా..

మెత్తంగ మొత్తంగ 

దోచేసిపోయేందుకా.. ఆహ... 


నీ కోకకింత కులుకెందుకు.. 

నీ చేతికింత చొరవెందుకు


చరణం 1 :


అరెరే.. 

నీ ఒంటి మెరుపంత తాగి.. 

నా కళ్ళు ఎరుపెక్కి తూగే

రమ్మంది నీ కళ్ళ జీర.. 

బరువైంది నా గళ్ళ చీర

కుబుసం విడిచిన నాగులా.. 

బుస కొట్టే నాజూకులు..

చిలిపిగ తాకిన చూపులో.. 

చలిపెంచే వడగాడ్పులు..

ఈ కొత్త ఆవిర్లు.. ఈ తీపి తిమ్మెర్లు.. 

అయ్యయ్యయ్యయ్యో 

మెలిపెట్టిలాగాయి నీ ముందుకు..


నీ కోకకింత కులుకెందుకు.. 

నీ చేతికింత చొరవెందుకు 


చరణం 2 : 


అహా.. అహా.. 

ఒణికింది తొలి ఈడు తీగ.. 

ఓ కొంటె గిలిగింత రేగ

కౌగిల్లే పందిళ్లు చేసి.. 

పాకింది కళలెన్నో పూసి..

కవ్వించే ఈ హాయిలో.. 

చెఖుముఖి రాపిడి చూడు

కైపెక్కే సైయ్యాటలో... 

తికమక తకధిమి చూడు    

ఈ మంచు మంటల్లో.. 

మరిగేటి మోజుల్లో.. 

అమ్మమ్మమ్మమ్మమ్మో.. 

ఈ ఉడుకు తగ్గేది ఏ మందుకు..


నీ కోకకింత కులుకెందుకు.. 

రప్పపపరప్పప... రప్పపపప

నీ చేతికింత చొరవెందుకు.. 

రప్పపపరప్పప... రప్పపపప

అందాలన్నీ చుట్టుకున్నందుకా... 

ఆరాటాలు చెల్లబెట్టేందుకా

చిన్నారి నీ మేను 

ముద్దాడుతున్నందుకా.. 

ఓ..ఓయ్..ఓయ్.. 


నీ చూపుకింత చురుకెందుకు.. 

నీ రైకకింత బిగువెందుకు


- పాటల ధనుస్సు